BSC: బీఎస్సీ నర్సింగ్కు నీట్ యూజీ అర్హత 7 d ago
రాష్ట్రంలోని నర్సింగ్ కళాశాలల్లో వచ్చే (2026-27) విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ నర్సింగ్(నాలుగేళ్ల)లో చేరాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్-యూజీ ప్రవేశ పరీక్ష రాయడం తప్పనిసరి చేసినట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లకు నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో పాల్గొనడం అర్హతగా చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసిందని తెలిపారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ షెడ్యూల్ను విడుదల చేసిందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 8 అని వెల్లడించారు. నర్సింగ్ కోర్సు చేయాలనుకునే విద్యార్ధులంతా నీట్ యూజీకి దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ కోరారు. పూర్తివివరాలకు ఇక్కడ్ క్లిక్ చేయండి.